![]() |
![]() |
.webp)
సోషల్ మీడియాలో శ్రీవాణి-విక్రమ్ జోడి వీడియోస్ ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. శ్రీవాణి సీరియల్స్ చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు షోస్, ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు వీళ్ళు వాలెంటైన్స్ డే స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. "మా ప్రేమ జర్నీ ఈ ఏడాదితో 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 2006 లో మా ప్రేమ మొదలయ్యింది. 2007 లో పెళ్లి చేసుకున్నాం. ఇన్నేళ్లు సంతోషంగా ఉన్నాం..ఇక శ్రీవాణి షూటింగ్ లో ఉంది..తనకు నేను చేసే చికెన్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నేనే వండి షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్లి ఇస్తాను..ఇక కేక్ , చాక్లేట్లు కూడా తీసుకుంటాను. అవంటే శ్రీవాణికి చాలా ఇష్టం. " అని చెప్పాడు విక్రమ్. షూటింగ్ స్పాట్ కి వెళ్లిన విక్రమ్ ని చూసి శ్రీవాణి షాకైపోయింది.
"చాలామంది నెటిజన్స్ శ్రీవాణి బ్రాహ్మిన్ మరి చికెన్ ఎలా తింటోంది అని అడుగుతున్నారు..ఐతే శ్రీవాణి బ్రాహ్మిన్ గా 17 ఏళ్ళు ఉంటే రెడ్డిగా 18 ఏళ్ళు ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం భర్త అడుగుజాడల్లో నడవాలి కాబట్టి శ్రీవాణి చికెన్ తింటుంది అది మా హక్కు" అని చెప్పాడు. "మేము కులానికి, మతానికి సంబంధించి ఏమీ చెప్పడం లేదు..మీరు అనవసరంగా కామెంట్స్ పెట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు" అని చెప్పాడు విక్రమ్. ఇక షూటింగ్ లో ఉన్న లేడీస్ అందరితో కలిసి శ్రీవాణి, విక్రమ్ కేక్ కట్ చేసి తిన్నారు. "హ్యాపీ వాలెంటైన్స్ డే.. ఏం గిఫ్ట్ ఇస్తున్నావ్...బొక్కలో లొకేషన్ కి వచ్చేసి కేక్ కట్ చేయించి చికెన్ ఇస్తామంటే ఒప్పుకోము నువ్వేదో నాకు చెప్తాను అన్నావ్ కదా అది చెప్పు" అంది " శ్రీవాణి వచ్చి ఒక కోరిక అడిగింది. ఎప్పుడన్నా ఏ రోజైనా సరే 11 గంటల కల్లా నిద్రపోవాలి ఏమన్నా కార్యక్రమాలు ఉంటే తన పర్మిషన్ తీసుకోవాలని చెప్పింది..అందుకే రేపటి నుంచి తొందరగానే నిద్రపోతాను." అని ప్రామిస్ చేసాడు. "నేను 18 ఏళ్లకే పెళ్లి చేసేసుకున్నా.. 1989 లో పుట్టాను.. అంటే నా వయసు 34 ఏళ్ళు" అని చెప్పింది శ్రీవాణి.
![]() |
![]() |